నారింజ పండ్లు మనకు సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా మార్కెట్‌లో లభిస్తాయి. వీటి ధర కూడా తక్కువే ఉంటుంది. అందువల్ల ఎవరైనా వాటిని కొనుగోలు చేసి తినవచ్చు. అయితే నారింజ పండ్లను తినడం వల్ల మనకు అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు.. అధిక బరువు ఉన్నవారు నారింజ పండ్లను తినాలి. అలాగే ఆ పండ్లను తినడం వల్ల మనకు ఇంకా పలు ఇతర లాభాలు కూడా కలుగుతాయి. అవేమిటంటే…
1. నారింజ పండ్లలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. తరచూ నారింజ పండ్లను తింటే దృష్టి సమస్యలు ఉన్నవారు ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. అలాగే ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి.
2. నారింజ పండ్లను తినడం వల్ల పురుషుల్లో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. స్త్రీలలో రుతు సంబంధ సమస్యలు పోతాయి. దీని వల్ల సంతాన సాఫల్యత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
3. మలబద్దకం ఉన్నవారు నారింజ పండ్లను తినాలి. రాత్రి పూట నారింజ పండ్లను తింటే మరుసటి రోజు సుఖ విరేచనం అవుతుంది.
4. నారింజ పండ్లను తినడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్‌ఫెక్షన్లు తగ్గుతాయి. డిప్రెషన్ బారి నుంచి పడవచ్చు. మానసిక ఆందోళన, ఒత్తిడి తగ్గుతాయి.
5. దంత సమస్యలు ఉన్నవారు నారింజ పండ్లను తింటే ఫలితం ఉంటుంది. నోటి దుర్వాసన, నోటిలో పుండ్లు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగు పడుతుంది. హైబీపీ తగ్గుతుంది.
6. నారింజ పండ్లలో ఉండే ఔషధ గుణాలు చర్మ సమస్యలను తగ్గిస్తాయి. క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. ఆహారం తిన్నాక నారింజ పండ్లను తింటే సులభంగా ఆహారం జీర్ణమవుతుంది.
7. నారింజ పండ్లను తినడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ఆస్తమా ఉన్నవారు, వెంట్రుకల సమస్యలు ఉన్నవారు నారింజ పండ్లను నిత్యం తమ ఆహారంలో భాగం చేసుకుంటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు.