నేరేడు పళ్ళు మనకి ఈజీగా దొరుకుతాయి. పైగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మందికి నేరేడు చేసే మేలు గురించి తెలియదు. అయితే ఈరోజు నేరేడు పళ్ళు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు పొందొచ్చు…?, ఏ సమస్య నుండి బయట పడవచ్చు అనేది చూద్దాం.
ఆరోగ్యానికి, అందానికి కూడా నేరేడు మనకు ఎంతగానో ఉపయోగపడతాయి. నేరేడు లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ సమృద్ధిగా ఉంటాయి. దీనితో చాలా సమస్యల నుండి బయట పడడానికి అవుతుంది.
కొలెస్ట్రాల్ లెవెల్స్:
నేరేడు లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఇది చూసుకుంటుంది. హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలు నుండి కూడా బయటపడచ్చు. కాబట్టి దొరికినప్పుడల్లా నేరేడు పండ్లు తీసుకుంటూ ఉండండి.
హైబీపీ సమస్య తగ్గుతుంది:
హైపర్ టెన్షన్ లేదా హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ సమస్యలు వున్నవారు కూడా తీసుకుంటే మంచిది.
కార్డియో వాస్కులర్ సమస్యలను తొలగిస్తుంది:
కార్డియో వాస్కులర్ సమస్యలను నేరేడు తొలగిస్తుంది. అలానే ఇతర అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది.
బ్లడ్ సర్క్యులేషన్:
ఇందులో పొటాషియం ఉంటుంది ఇది బ్లడ్ సర్క్యులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. దీనితో హైబీపీ హైపర్టెన్షన్ నుండి కూడా బయటపడొచ్చు.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది:
నేరేడు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అదే విధంగా దగ్గు, జలుబు, జ్వరం, ప్లూ వంటి సమస్యల నుండి బయట పడవచ్చు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి:
నేరేడు తీసుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి కాబట్టి నేరేడుని ఈ సమస్య ఉన్న వాళ్లు కూడా తీసుకోండి.
మెదడుకి మంచిది:
మెదడు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది డిమెన్షియా, ఆమ్నీషియా వంటి సమస్యల నుండి ఇది బయట పడేస్తుంది.