కరోనా కు చికిత్స చెయ్యాలి అంటే కచ్చితంగా గుండె ధైర్యం ఉండాలి. కరోనా వైరస్ ని ఎదుర్కోవడానికి గాని వైద్యులకు చాలా మానసిక బలం అవసరం. కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అయినా సరే ఎవరూ కూడా ఇప్పుడు తమ ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టి లో పెట్టుకుని విధుల్లో చేరుతున్నారు. నిత్యం ప్రజల ప్రాణాల కోసం ఇళ్ళకు వెళ్ళకుండా తీవ్రంగా కష్టపడుతున్నారు.
ఇదే బాటలో ఉన్నారు విజయనగరం జిల్లాకు చెందిన ఝాన్సి అనే డాక్టర్. ఆమె ఏడు నెలల గర్భిణి. ఆమెకు కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉన్నా సరే అక్కడ ప్రజల్లో అవగాహన కల్పిస్తూ చికిత్స చేస్తున్నారు. ధైర్యంగా బయటకు వస్తున్నారు. తనకు ఇది సామాజిక బాధ్యత అని… నేడు జిల్లాలో కేసులు లేవని కాని ఒకవేళ కేసులు పెరిగితే తాను చికిత్స చేయడానికి సిద్దంగా ఉన్నా అని ఆమె స్పష్టం చేసారు.
ఇప్పటి వరకు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కరోనా కేసులు దాదాపుగా లేవు. అయినా సరే ఆమె మాత్రం ఎక్కువగా ప్రజల్లోనే ఉండే ప్రయత్న౦ చేస్తున్నారు. జిల్లా సరిహద్దులను అధికారులు మూసి వేసారు. విశాఖ వెళ్ళే రహదారులను, ఓడిస్సా వెళ్ళే రహదారులను అధికారులు మూసి వేయడం తో ఇప్పుడు అక్కడ కరోనా లక్షణాలు కూడా ఏమీ లేవు. దీనితో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.