ఎక్కువ ఆధిపత్యం చెలాయించే పార్ట్నర్స్ ఉంటే కాస్త కష్టంగా ఉంటుంది. ప్రతి చిన్న దానికి కూడా ఏదో ఒక సమస్య వస్తుంది. అయితే రాశుల ఆధారంగా ఆధిపత్యం ఎలా చెలాయిస్తుంటారు..?, ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి..?, వాళ్ల యొక్క పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం.
సింహ రాశి :
సింహ రాశి వాళ్లు నిర్ణయాలన్నీ బాగా తీసుకోగలుగుతారు. వీళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఎంతటి పెద్ద సమస్య అయినా సరే వాళ్లు సులువుగా సాల్వ్ చేసుకోగలరు. పైగా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా వీళ్ళు నిలుస్తారు.
మేష రాశి :
మేషరాశి వాళ్లకి కూడా లీడర్షిప్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు ఎలా అయితే ఆలోచిస్తారో అదే విధంగా అందరూ ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. పైగా వీళ్ళతో చాలా కష్టంగా ఉంటుంది. అలాగే ఈ రాశి వాళ్ళు ఎక్కువ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు.
ధనస్సు రాశి :
ఇక ధనస్సు రాశి వాళ్ల గురించి చూస్తే… వీళ్ళకి ప్రయాణాలు చేయడం అంటే ఎంతో ఇష్టం. అలానే వీళ్ళకి ఏం కావాలి అనే దాని గురించి వీరికి బాగా తెలుసు. పైగా ఎక్కువ ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు.
వృషభ రాశి :
వృషభ రాశి వాళ్ళ స్వభావం చూస్తే.. చాలా పొసెసివ్ గా ఉంటారు. పైగా రిలేషన్ షిప్ లో ఎంతో ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. పైగా వీళ్ళకి కోపం కూడా ఎక్కువగా ఉంటుంది.
మిధున రాశి :
మిధున రాశి వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవడం చాలా కష్టం పైగా ఎక్కువగా ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటారు. వీళ్ళతో సర్దుకోవడం కూడా మనకి కష్టంగా ఉంటుంది.
వృశ్చిక రాశి :
ఈ రాశి వాళ్ళు కూడా చాలా డామినెంట్ గా ఉంటారు అయితే వీళ్ళు ఎప్పటికి ఎవరిని మన్నించరు కోపంగా కూడా ఉంటారు.
తులారాశి :
తులా రాశి వాళ్ళు చాలా ప్రమాదకరం. ఆధిపత్యాన్ని కూడా చెలాయిస్తూ ఉంటారు ఇతరులను
ఇన్ఫ్లుయెన్స్ చేయడం లో వీళ్ళ ముందుంటారు.