ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు ఘని ఇల్లు పొడిచి పారిపోయాడు. వెళ్ళేటప్పుడు ఘని డబ్బు కట్టలతో సహా పారిపోయినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే తాను డబ్బుతో పారిపోలేదని కేవలం కట్టుబట్టలతో వెళ్లానని ఘని తెలిపారు. మళ్లీ దేశానికి వస్తానని చెప్పారు.
ఇక ఆ దేశ అధ్యక్షుడు పారిపోవడంతో తాళిబన్ల నుండి రక్షిస్తానని ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అమ్రుల్లా సాలెహ్ ప్రకటించుకున్నారు. ఆయనకు పలు దేశాలు మద్దతు కూడా ప్రకటించాయి. అయితే తాజాగా ఆయనకు ట్విట్టర్ షాక్ ఇచ్చింది. గురువారం అమ్రుల్లా ట్విట్టర్ ఖాతాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. దాంతో ఈ అంశం సంచలనంగా మారింది. దీనిపై స్పందించిన ట్విట్టర్ నిబంధనలకు లోబడే అమ్రుల్లా అకౌంట్ ను తొలగించామని వెల్లడించింది.