70 ఏళ్లుగా ఆమె మంచుకొండల్లోనే.. తెలిస్తే షాక్‌ అవుతారు..

-

అది సైబీరియా మంచు ఎడారి.. జనావాసానికి దాదాపు 250 కిలోమీటర్ల దూరం.. మైనస్‌ 50 డిగ్రీల సెల్సియస్‌కు ఉష్ణోగ్రతలు పడిపోయే చోట ఓ ఇల్లు నిర్మాణం కొనసాగుతుంది. మైనస్‌ 50 డిగ్రీల సెల్సియస్‌ వద్ద ఇళ్ల నిర్మాణ మేంటి అదేలా సాధ్యమవుకుంటున్నారా ..? అవును అది 76 ఏళ్ల వృద్ధురాలు అగాఫ్యా లైకోవాకు సాధ్యమౌంది. 30 ఏళ్లుగా ఒంటరిగా అక్కడే జీవిస్తున్నది.రష్యాలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చి సోవియెట్‌ యూనియన్‌ ఏర్పడ్డాక కొన్నాళ్లకు అక్కడి మత స్వేచ్ఛకు విఘాతం తలెత్తే పరిస్థితులు నెలకొన్నాయి. రష్యాలో ఉంటున్న అనే క్రైస్తవ చాందస వర్గంలో కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. అప్పుడే (1936)లో తల్లిదండ్రులు ఉన్న ‘లైకోవ్‌ కుటుంబం’ తమ మతాన్ని కాపాడుకోవడానికి సైబీరియా మంచు అడవుల్లోకి పారిపోయారు. కొద్ది కాలం తర్వాత వారికి మరో ఇద్దరు పిల్లలు జన్మించారు. ఆ ఇద్దరిలోనే ఒకరు అగాఫ్యా.

జీవితాంతం అర్ధకాలే..

సైబీరియా మంచు అడవి చాలా భయంకరౖమైంది. అక్కడ ఏమాత్రం జీవించేందుకు ఆస్కారం ఉండదు. అప్పుడు రష్యా ప్రభుత్వం తమ మీద తిరగబడే వారిని సైబీరియా జైలుకు పంపి వారంతకు వారే మరణించేలా చేసేది. అలాంటి సైబీరియాలో అగాఫ్యా కుటుంబం అక్కడ ఉన్నట్టుగా ఎవరికీ తెలియదు. ఈ క్రమంలో అగాఫ్యా తల్లి రోజు ఆహారాన్ని తన పిల్లలకు పెడుతూ అర్ధకాలితో అనారోగ్యానికి గురై చనిపోయింది. ఆ తర్వాత మిగిలిన తోబుట్టువులు వివిధ రకాల రోగాలతో మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత 1988లో తండ్రి సైతం ప్రాణాలు వదిలాడు. నాటి నుంచి అప్పటి దాదాపు 30 ఏళ్లుగా అగాఫ్యా అక్కడ ఒంటరిగానే జీవనం గడుపుతుంది.

రిపోర్టర్‌ కథనాలతో వెలుగులోకి..

1980 లో అక్కడికి వెళ్లిన కొందరు భూగర్భ శాస్త్రవేత్తలు మొదటిసారి అగాఫ్యాను, చావు బతుకుల్లో ఉన్న ఆమె తండ్రిని చూసిన వారిలో ఒకరు, వారిని కాపాడాడు. మెల్లిమెల్లిగా వారితో స్నేహం చేసుకొని 2015 వరకూ అగాఫ్యాకు ఒక్క నైబర్‌గా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఒక రిపోర్టర్‌ అగాఫ్యా ఉన్న ప్రాంతాన్ని సందర్శించి ఆమె గురించి కథనాలు రాసి ప్రచురించాడు. దీంతో అగాఫ్యా గురించి రష్యా అంతా పాకిపోయింది. ‘మొదటి సారిగా అగాఫ్యా చూస్తే మతి భ్రమించిందననుకున్నాను. ఆమె మాట్లాడే భాష ప్రస్తుతం వాడుకలలో లేదు. అయినా ఆమె ప్రవర్తన, ఇల్లు నిర్వహించుకునే తీరు చూసి మామూలుగానే ఉన్నట్లు గుర్తించానని’ ఆ రిపోర్టర్‌ చెప్పుకొచ్చాడు . సోవియట్‌ యూనియన్‌ ప్రభుత్వం ఆమె ఖర్చులన్నీ భరించి ఒక నెల పాటు రష్యాంతా చూపించింది. అప్పుడే మొదటిసారి అగాఫ్యా కరెన్సీ, జనాలు, వాహనాలను చూసింది. అయితే ఆమె మాత్రం అక్కడ ఉండేందుకు ఇష్టపడలేదు. మళ్లీ తాను ఉంటున్న మంచుకొండల్లోకి వచ్చేసింది.అగాఫ్యా ఉంటున్న ప్రాంతంలో రోడ్డు మార్గం లేదు. అక్కడ కరెంటు లేదు. కొన్ని గొర్రెల్ని పెంచుకుంటూ వేట ద్వారా అడవిలో దొరికే కాయల ద్వారా తోడేళ్ల నుంచి ఎలుగుబంట్ల నుంచి కాపాడుకుంటూ జీవిస్తోంది. ‘మా కుటుంబం ఆకలికి తాళలేక ఒక్కోసారి బూట్లు ఉడకబెట్టుకొని తిన్న సందర్భాలు ఉన్నాయి’ అని ఆమె చెప్పింది.

చివరి వరకూ..

సైబీరియాలో చలికాలంలో ఉష్ణోగ్రతలు మైనస్‌ డిగ్రీలకు పడిపోతాయి. ఇప్పుడు అగాఫ్యా ఉంటున్న ఇల్లు ధీనావ‌స్థ‌లో ఉంది. కాని ఆమె అక్కడి నుంచి రానంటున్నది. ‘నగరపు గాలి నాకు పడదు. జబ్బు పడతాను. అక్కడి శబ్దాలు వింటే భయమేస్తోందని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. దీంతో రష్యాకు చెందిన ఓ కోటీశ్వరుడు ఒలెగ్‌ దెరిపాస్కా ఆమెకు ఇల్లు కట్టడానికి ముందుకొచ్చాడు. నిర్మాణ సామాగ్రి ఆమె ఉంటున్న చోటుకు తీసుకుపోవడనికి పడవలు, హెలికాప్టర్లు ఉపయోగించాల్సి వస్తోంది.ప్రస్తుతం ప్రభుత్వం ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. నెలలో ఒకటి రెండుసార్లు ఎవరో ఒకరు వచ్చి ఆమెను గమనించి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news