మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సింగు సరిహద్దు వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న పంజాబ్ జలంధర్ కు చెందిన ఒక రైతు కంటైనర్ ట్రక్కును పూర్తిగా ఒక టెంపరరీ హౌస్ గా మార్చేశాడు. హర్‌ప్రీత్ సింగ్ మట్టు అనే ఆ రైతు యొక్క తాత్కాలిక వసతి గృహంలో సోఫా, బెడ్, టివి మరియు మొబైల్ ఛార్జింగ్ పాయింట్లతో పాటు ఫంక్షనల్ టాయిలెట్ వంటి అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి.
ఇక ఆ రైతును పలకరించే ప్రయత్నం చేయగా “నేను యుఎస్ లో ఉన్న నా అన్నయ్య ఆదేశానుసారం డిసెంబర్ 2 న ఇక్కడకు వచ్చాను. రైతులకు సేవ చేయమని ఆయన నన్ను కోరారు. నేను నా పనులన్నీ వదిలి సింగు సరిహద్దులో ఏడు రోజులు పని చేశాను. అంతకుముందు నా ఐదు ట్రక్కులు కూడా ఇక్కడకు వచ్చాయి, నేను ఆ సమయంలో బస చేసిన నా హోటల్‌కు తిరిగి వచ్చినప్పుడు, నేను హోం శిక్ ఫీలయ్యాను, అందుకే ట్రక్కును ఒక టెంపరరీ ఇంటిగా ఎందుకు మార్చకూడదని నేను అనుకున్నాను “అని ఆయన చెప్పుకొచ్చాడు.
Delhi: Jalandhar based farmer protesting at Sighu border turns a truck container into a residence
“I came here on Dec 2 to do langar sewa. I left all my work & served for 7 days at Singhu border. I felt homesick & then decided to turn a truck into a makeshift apartment,” he says pic.twitter.com/FIsmkzeJS7
— ANI (@ANI) January 2, 2021