కువైట్ కుతంత్రం…! 8 లక్షల భారతీయుల పొట్టలు కొట్టడానికి సిద్ధం..!

-

కువైట్ లో విధులు నిర్వహిస్తున్న భారతీయుల సంఖ్య దాదాపుగా 15 లక్షలు. అందులో దాదాపుగా 8 లక్షల మందికి ఓ పెద్ద సమస్యే వచ్చి పడింది. అక్కడి ప్రభుత్వం త్వరలో ఓ పథకాన్ని అమలు చేయనున్నారు అదే ప్రవాసీ ముసాయిదా బిల్. ఆ పథకం కొరకు వారి ఈపాటికే బిల్ కూడా పాస్ చేశారు అది గనుక ఆమోదం పొంది అమలవుతే ఈ 8 లక్ష్ల మంది మాత్రమే కాకుండా విదేశీ ప్రజలంతా వేరే గత్యంతరం లేక తమతమ స్వదేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిందే. ఈ బిల్ రాజ్యాంగ బద్దమే అని అక్కడి ప్రభుత్వం చెబుతుంది దాంతో దాదాపుగా ఈ బిల్ త్వరలో ఆమోదం పొందటం ఖాయం అని చెబుతున్నారు నిపుణులు.

8 lakh indians to return their homes as kuwait government passes a bill
8 lakh indians to return their homes as kuwait government passes a bill

ఈ ముసాయిదా బిల్లు రాజ్యాంగ బద్ధమేనని పేర్కొన్న కువైట్‌ జాతీయ అసెంబ్లీలోని లీగల్, లెజిస్లేటివ్ కమిటీ.. సమగ్ర ప్రణాళికను రూపొందించేందుకు మరో కమిటీకి బిల్లును అప్పగించింది. ఇక ఈ బిల్ లోని నియమాల ప్రకారం అక్కడి జనాభాలో భారతీయుల సంఖ్య 15 శాతానికి మించకూడదు. ఈ నియమం ప్రకారం అక్కడ ఇప్పటికే 14.50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అంటే ఉండాల్సిన దానికన్నా 8 లక్షలు మంది ఎక్కువే ఉన్నారు. దాంతో ఇప్పుడు గనుక ఆ బిల్ ఆమోదం పొందుటే వారంతా తిరిగి తమ ఇళ్లకు రావాల్సిందే అంటున్నారు నిపుణులు. మరి ఏం జరగబోతుందో తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news