గిన్నిస్ బుక్ ఎక్కిన 80 మంది భారతీయులు…!!!

-

గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించాలంటే మాములు విషయం కాదు. ఎవరూ చేయని పని చేసి ఉండాలి, లేదా ఎవరన్నా చేసిన పనిని వారికంటే తక్కువ సమయమలో చేసి చూపించాలి. ఇలాంటి టాలెంట్ ఉంటే మీరు గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించినట్టే. అయితే ప్రతీ ఏటా గిన్నిస్ బుక్ లో స్థానం సాధించిన వారి వివరాలు పొంది పరుస్తుంది సదరు సంస్థ. ఈ ఏడాది కూడా 2020 లో  గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించిన వారి వివరాలని తెలిపింది.

Image result for indians-in-80-guinness-world-records

సుమారు 80 మంది భారతీయులు 2020 కి గాను గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. తాజాగా నమోదైన రికార్డులతో కలిసి ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకంలో భారతీయులకి చెందిన 80 అంశాలు ఉన్నాయి. ఈ అంశాల వారిగా చూస్తే. అత్యంత పొడవైన కురులు ఉన్న మహిళగా నిల్షాని పటేల్ గిన్నిస్ లో చోటు దక్కించుకుంది. ఇంతకీ ఆమె జుట్టు పొడుగు 5.7 అంగుళాలు.

 

అలాగే నాగపూర్ కి చెందిన జ్యోతి  అత్యంత పొట్టి వ్యక్తిగా 24 .7 అంగుళాల తో రికార్డ్ సృష్టించింది. ఇక పొడవైన చేతి గోళ్ళు సుమారు 909.6 సెం. మీ ఉన్న వ్యక్తిగా పూణే కి చెందిన  శ్రీధర్ రికార్డులకి ఎక్కారు. అత్యంత దూరం ప్రయాణించిన ముగ్గురు భారతీయులు గిన్నిస్ లో స్థానం సంపాదించారు. 736 రకాల కాగితం పూలు సంపాదించిన వ్యక్తంగా శంకర్ నారాయణన్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలా అందరి రికార్డ్ లు పొందు పరుస్తూ పుస్తకం విడుదల కూడా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news