అయ్యప్ప భక్తుల కోసం అదిరిపోయే యాప్..!

-

అయ్యప్ప మాల తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది వేస్తుంటారు. 40 రోజులు క్రమశిక్షణతో కూడిన దీక్ష తర్వాత అయ్యప్పను దర్శించుకుని ఇరుముడి సమర్పిస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా లక్షలాది మంది భక్తులు శబరిమలకు వెళుతుంటారు. అయితే ఈ అయ్యప్ప భక్తుల్లో అనేక విషయాల్లో అనేక సందేహాలు తలెత్తుతుంటాయి.

దీక్షకు సంబంధించిన సందేహాలు, దీక్ష పూర్తయిన తర్వాత చేపట్టే యాత్రకు సంబంధించిన సందేహాలు వస్తుంటాయి. వీటి కోసం ఇక ఎవరినీ అడగాల్సిన అవసరం లేదు. శరణమయ్యప్ప అనే యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌ లోడ్ చేసుకుంటే చాలు.. హైదరాబాదుకు చెందిన జెమినీ సర్వీసెస్ సంస్థ దీన్ని రూపొందించి భక్తుల కోసం అందుబాటులో ఉంచింది.

ఈ యాప్ ద్వారా అయ్యప్ప శ్లోకాలు, కథలు, పూజా సేవలు, గురుస్వామి గ్రూపులు, యాత్ర సమాచారం.. 40 రోజుల పాటు ఏయే ప్రాంతాల్లో పూజలు నిర్వహిస్తుంటారు.. వంటి వివరాలు సమగ్రంగా ఉంటాయి. అంతే కాదు.. శబరియాత్రకు ఎలా వెళ్లాలి.. ఎలా ప్లాన్ చేసుకోవాలి. అక్కడి ఆలయ సేవల వివరాల వరకూ అన్నీ ఇందులో ఉంటాయి.

ఈ యాప్ రూపకల్పనలో కేరళ పాలక్కాడకు చెందిన అరుణ్ గురుస్వామి సహాయం తీసుకున్నారట. ఆయన మూడున్నర దశాబ్దాలుగా అయ్యప్ప సేవలో ఉన్నారు. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ నుంచి దీనిని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

శబరిమల యాత్ర సమయంలో వందలాది కిలోమీటర్లు ప్రయాణించేటపుడు అనుకోని ఆపద ఎదురైతే ఏమి చేయాలి… అక్కడ బస చేసేందుకు ఎవర్ని సంప్రదించాలి.. ఇటువంటి ఎన్నో అనుమానాలను ఈయాప్ నివృత్తి చేస్తుంది. భలే బావుంది కదూ.. ఇంకేం మీరు, మీ స్నేహితులకు ఈ యాప్ ను పరిచయం చెయ్యండి. స్వామియే శరణం అయ్యప్ప.

Read more RELATED
Recommended to you

Latest news