గన్నవరం. కృష్ణా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం ప్రబావం ఎక్కువగా ఉన్న కీలకమైన నియోజకవర్గం. అంత ర్జాతీయ వినామాశ్రయం ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. రాజకీయాలు ఇక్కడ ఎప్పుడూ వేడివేడిగానే ఉం టాయి. రైతాంగం ఎక్కువగా ఉండడంతో ఇక్కడి రాజకీయాలను రైతులను విడదీసి చూసే పరిస్థితి కూడా లేదు. అలాంటి నియోజకవర్గంలో ఇప్పుడు మళ్లీ ఉప ఎన్నికల హోరు కనిపించే అవకాశం కనిపిస్తోంది. గన్నవరం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి ఇక్కడ ఉప పోరుకు రంగం సిద్ధమవుతోంది.
ఇక్కడ నుంచి 2014, 2019లో విజయం సాధించిన టీడీపీ నాయకుడు వంశీ రాజీనామా చేయడంతో ఈ సీటుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. వంశీ రాజీనామా ఆమోదం పొందిన నాటి నుంచి ఆరు మాసాల్లోగా ఈ ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే, ఈ ఎన్నిక అటు అధికార, ఇటు ప్రతిపక్షాలకు కూడా కీలకంగా మారింది. జగన్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు మాసాల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరిగిపోయిందని అంటున్న టీడీపీ.. తన సీటును ఇక్కడ గెలిపించుకోవడం అత్యంత ప్రతిష్టాత్మకం.
అంటే.. ప్రభుత్వ వ్యతిరేకతతోనే ప్రజలు తమకు మళ్లీ పట్టం కట్టారని, వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీకే ఉప ఎన్నికల్లో విజయం లభిస్తుందని కానీ, వైసీపీ ఓడిపోవడం వెను క ప్రభుత్వ వ్యతిరేకతే ఉందని చెప్పుకొనేందుకు బాబుకు అవకాశం ఉంటుంది. అయితే, అదేసమ యం లో వైసీపీకి కూడా ఈ సీటు అంతే కీలకంగా మారనుంది. అధికారంలోకి వచ్చి ఐదుమాసాలు కూడా గడవక ముందుగానే లక్షల కొద్దీ ఉద్యోగాలు, అనేక సంక్షేమ పథకాలు జగన్ అమల్లోకి తీసుకువచ్చారు.
ఇక రైతులకు భరోసా, ఇళ్లు, అమ్మవొడి, పోలీ సులకు వీక్లీ ఆఫ్ ఇలా అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నందున తమ ప్రభుత్వానికి ప్రజలు వేసే మార్కులుగానే భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీలు ఈ నియోజకవర్గాన్ని గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తాయనడంలో సందేహం లేదు. మరి ఎవరిది పైచేయి అవుతుందో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.