తెలంగాణ‌లో పిడుగుపాటుకు 9 మంది మృతి

-

తెలంగాణ‌లో పిడుగుపాటుకు 9 మంది మృతి చెందారు. గద్వాల జిల్లా అయిజ మండలం భూంపూర్ గ్రామంలో పిడుగుపాటుకు సర్వేసు(24), పార్వతి(34), సౌభాగ్య(36) అనే ముగ్గురు వ్యవసాయ కూలీలు మృతి చెందారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామంలో పొలంలో కలుపు తీస్తున్న ఆలకుంట ఎల్లయ్య(37), భార్య లక్ష్మీ (32), మేనమామ బండారి వెంకన్న(50) అనే ముగ్గురు రైతులను బలి తీసుకుంది పిడుగుపాటు.

9 people killed in lightning strike in Telangana
9 people killed in lightning strike in Telangana

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం చీమగూడెం గ్రామంలో పిడుగుపాటుకు పాయం నర్సయ్య(50) అనే రైతు మృతిచెందాడు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్యనారాయణపురం గ్రామంలో బర్లు కాసేందుకు వెళ్లిన మహేష్(32), మధిర సమీపంలోని మడిపల్లి గ్రామానికి చెందిన గడిపూడి వీరభద్రరావు(50) అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news