తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 15న జరగనుంది. తుమ్మిడి హట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం, పంచాయతీ ఎన్నికలపై క్యాబినెట్ లో చర్చలు జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఓవైపు సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు తీర్పునిచ్చింది, కాగా, ఈ సమయం దగ్గర పడుతుండడంతో అధికారులు టెన్షన్ లో ఉన్నారు. మరోవైపు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక జీవో ద్వారా ఎన్నికలకు వెళ్లే అంశంపై మంత్రివర్గం ఓ నిర్ణయానికి రాబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఈ సమావేశం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా…. మరో 10 రోజులలో తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభం కానుంది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి జిల్లాకు 30 లక్షలను రిలీజ్ చేశారు. ఆ 30 లక్షలతో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. త్వరలోనే తెలంగాణలోని మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో బతుకమ్మ పండుగ గురించి కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయి.