ఏపీ అసెంబ్లీ నుంచి 9 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..

-

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. ఈ క్ర‌మంలోనే 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలు స‌స్పెండ్ అయ్యారు. ఏపీ రాజధానిపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి బుగ్గన ప్రసంగానికి టీడీపీ సభ్యలు అడ్డు తగిలారు. ఈ క్రమంలో సీఎం జగన్‌ జోక్యం చేసుకొని, వారిని సస్పెండ్ చేయాలని స్పీకర్ తమ్మినేని సీతారాంకు విజ్ఞప్తి చేశారు. దాంతో 9 మంది టీడీపీ సభ్యులను ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు స్పీకర్.

సస్సెండ్ అయిన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, వెలగపూడి రామకృష్ణబాబు, మద్దాల గిరి, వీరాంజనేయస్వామి, అశోక్, ఏలూరి సాంబశివరావు, అనగాని సత్యప్రసాద్, రామ్మోహన్ ఉన్నారు. టీడీపీ సభ్యులను ఉద్దేశ్యపూర్వకంగా సస్పెండ్ చేయలేదని.. ప్రతి చిన్న దానికి పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడం సరికాదని స్పీకర్ తమ్మినేని అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాల్సి రావడం బాధాకరమన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news