చంద్రబాబుకి చుక్కలు చూపిస్తున్న 10 మంది ఎమ్మెల్యేలు…!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో… తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడిందా…? అంటే అవుననే సమాధానమే ఎక్కువగా వినపడుతుంది. వాస్తవానికి సభలో ఆ పార్టీకి బలం చాలా తక్కువ… రాజకీయంగా ఆ పార్టీకి బలం లేకపోయినా సరే తెలుగుదేశంలో ఉన్న కొందరు ఎమ్మెల్యేలు సభలో తమ ప్రతాపం చూపించే ప్రయత్నం ఎక్కువగానే చేసారు. ఇక చంద్రబాబుకి అండగా నిలబడ్డారు 5 మంది ఎమ్మెల్యేలు… మంగళవారం సభలో సస్పెండ్ చేసిన వాళ్ళు మాత్రమె చంద్రబాబుకి అండగా నిలబడ్డారు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది.

చంద్రబాబుని ఏదైనా అనగానే, లేదా తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు రాగానే వేగంగా స్పందిస్తూ ఆయనకు నిలబడిన అచ్చేన్నాయుడు, నిమ్మల రామానాయుడు వంటి వారే ఎక్కువగా కనపడ్డారు. అయితే ఇక్కడ పది ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబుకి దూరంగా ఉన్నారని అంటున్నారు. రాజకీయంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా వాళ్ళు చంద్రబాబుతో లేరనే వ్యాఖ్యలు ఆ పార్టీలో ఎక్కువగా వినపడుతున్నాయి. సోషల్ మీడియాలో… కూడా దీనిపై పెద్ద చర్చే జరుగుతుంది.

10 మంది ఎమ్మెల్యేలు సభలో కూడా కష్టంగా ఉంటున్నారని అంటున్నారు. పార్టీ మారే ఆలోచనలో వాళ్ళు ఉన్నారని అంటున్నారు. ప్రభుత్వం బలంగా ఉన్న సమయంలో మన వాదన ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉండదు అనే విషయం చంద్రబాబుకి వాళ్ళు ఇప్పటికే చెప్పినా చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదట. ఇక ఈ అసహనం చంద్రబాబులో బహిర్గతం అయినట్టు తెలుస్తుంది. సమావేశాలకు ఎందుకు రావడం లేదని నిలదీసినా సరే.. వ్యక్తిగత కారణాలు చెప్పడమే గాని… సభలో ఉండటం లేదట.. ప్రకాశం జిల్లాకు చెందిన ఒక ఎమ్మెల్యే అయితే… చంద్రబాబు మాటను కనీసం లెక్క చేయడం లేదని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news