ఇండియాలో ఆ విభాగంలో 90 వేల ఉద్యోగాలు ఖాళీ అంట…!

-

ఎడ్టెక్ సంస్థ గ్రేట్ లెర్నింగ్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం సంచలన విషయం వెల్లడి అయింది. 2020 ఆగస్టు చివరి నాటికి భారతదేశంలో 93,500 డేటా సైన్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. భారతీయ అనలిటిక్స్ స్టార్టప్‌ లలో ప్రతీ ఏటా నిధుల పెరుగుదల, భారతదేశంలో మెరుగైన అనలిటిక్స్ సామర్ధ్యాల అభివృద్ధికి పెట్టుబడులు పెట్టడం మరియు మహమ్మారి కారణంగా భారతదేశంలో ఉన్న సంస్థలకు అవుట్సోర్స్ చేసిన ఉద్యోగాలలో ఎక్కువ భాగం వంటి వాటిని ఈ లెక్కలతో కలిపారు.

ఈ రంగంలో ఖాళీలు తగ్గాయని పేర్కొంది. ఫిబ్రవరిలో 109,000 ఖాళీలు నుండి 2020 మేలో 82,500 ఖాళీలకు తగ్గాయని పేర్కొన్నారు. ప్రస్తుత డిమాండ్‌లో ఎంఎన్‌సి, దేశీయ ఐటి, కెపిఓ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి బెంగళూరు భారతదేశంలో 23 శాతం ఎనలిటిక్స్ ఉద్యోగాలను కల్పిస్తుంది అని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news