మాస్క్ ల అవసరాన్ని ఆధారంగా చేసుకుని ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్న వారి ఆట కట్టించడానికి మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్ ల ధరలను కట్టడి చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ పలు సిఫార్సులు చేసింది. కమిటీ తన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం.
కమిటీ తన సిఫారసులను సమర్పించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే ధృవీకరించారు. ప్రతీ మాస్క్ గరిష్టంగా రూ .50 చొప్పున వసూలు చేస్తారు. ఎన్ -95 మాస్క్ ధరలను కట్టడి చేస్తామని మంత్రి చెప్పారు. తయారీ విధానం, లభ్యత మరియు ముడి పదార్థాల స్థోమత మరియు మార్కెట్లో డిమాండ్ గురించి వివరంగా అధ్యయనం చేసిన తరువాత రేట్లు ఖరారు చేసారు. ఎన్ -95 మాస్క్ సుమారు రూ .19 నుంచి రూ .50 వరకు లభిస్తుంది, డబుల్ మరియు ట్రిపుల్ లేయర్ మాస్క్‌లు కేవలం 3 రూపాయల నుంచి 4 రూపాయల వరకు లభిస్తాయి.