సంగారెడ్డి లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం..!

సంగారెడ్డి లో మైనర్ బాలిక కిడ్నాప్ కలకలం రేపింది. 7 సంవత్సరాల మైనర్ బాలికను దుండగులు కిడ్నాప్ చేశారు. సంగారెడ్డికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి జోగిపేట వైపు బైక్ పై తీసుకువచ్చారు. శివంపేట కల్లు దుకాణంలో కల్లు సేవించేందుకు బాలికను ఆగంతకులు వెంట తీసుకెళ్లారు. చిన్నారి ఏడుస్తుండడంతో అనుమానంతో గ్రామస్థులు ఆగంతకులను నిలదీయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

అత్యాచారం

వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు దుండగులు అంగీకరించారు. బాలికను రక్షించి 108 లో పుల్కల్ పోలీసులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుల్కల్ పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు కంది, మరొకరు సదాశివపేట కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉండగా నిందితులను కఠినంగా శిక్షిస్తున్నా మృగల్లో మార్పు రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.