ప్రాణం తీసిన బీడి.. ఇల్లు దహనమై ఒకరి మృతి

నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలి తీసుకొంది. బీడి తాగి, నిప్పు ఆరిపివేయకుండా విసిరేయడంతో ఇల్లు దహనమై ఓ వృద్ధుడు మృతిచెందిన ఢిల్లీలో చోటుచేసుకుంది. మృతిచెందిన వ్యక్తిని సబ్జే హసన్‌గా పోలీసులు గుర్తించారు.

సెంట్రల్ ఢిల్లీలోని కమలా మార్కెట్‌‌ ప్రాంతంలో సబ్జే హసన్(75) ఒక రూమ్ గదిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. సంఘటన జరగడానికి గంట ముందు అతడి కుమారుడు తండ్రి వద్దకు వచ్చాడు. భోజనం తినిపించన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అర్ధరాత్రి 12.25 నిమిషాలకు ఇల్లు దహనమవుతుందని సమాచారం అందిందని, వెంటనే ఐదు ఫైర్ ఇంజిన్లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన సబ్జే హసన్‌ను హాస్పిటల్‌గా తీసుకెళ్లగా అప్పటికే మరిణించినట్లు డాక్టర్లు ధ్రవీకరించారు. అయితే, అగ్ని ప్రమాదం కచ్చితంగా ఎలా జరిగిందనే విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. బీడి కారణంగానే ఇల్లు దహనమై ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు.