బిజినెస్ ఐడియా: కేవలం 6 నెలల్లో 10 లక్షలు సంపాదించే వ్యాపారం.. రైతులకు బెస్ట్..

-

ప్రస్తుతం ఉద్యోగం చేసేవారికన్నా కూడా వ్యాపారం చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతుంది..అందరూ చేస్తున్న వ్యాపారం కాకుండా కొత్త ప్లాన్ చేస్తె మంచి లాభాలను పొందవచ్చని అనుకోనేవారికి చక్కటి బిజినెస్ ఐడియా ఉంది..ఇది రైతులకు మంచి లాభాలను అందిస్తుంది..అదే వెల్లుల్లి సాగు..అద్భుతమైన లాభాలు వస్తాయి. చాలా మంది రైతులు ఈ పంటను పండిస్తూ.. లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మొదటి పంటలోనే.. అంటే 6 నెలల సమయంలోనే.. ఏకంగా రూ.10 లక్షల వరకు సంపాదించవచ్చు.

వెల్లుల్లి నిజానికి వాణిజ్య పంట. భారతదేశంలో దీనికి ఏడాది పొడవునా డిమాండ్ ఉంటుంది. సుగంధ ద్రవ్యంగానే కాకుండా..ఔషధంగానూ ఉపయోగిస్తారు. అందుకే ప్రతి ఇంట్లో ఇది ఉంటుంది.అధిక రక్తపోటు, కడుపు వ్యాధులు, జీర్ణ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, కీళ్లనొప్పులు, నపుంసకత్వము, రక్త వ్యాధులకు కూడా వెల్లుల్లిని వాడుతారు. యాంటీ బ్యాక్టీరియల్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఔషధాల తయారీలో కూడా వీటిని వినియోగిస్తారు. నేటి కాలంలో వెల్లుల్లిని కేవలం సుగంధ ద్రవ్యంగా మాత్రమే కాకుండా.. అనేక రకాలుగా ఉపయోగిస్తున్నారు..వీటిని ప్రాసెస్ చేసి పేస్ట్, చిప్స్,పౌడర్ రూపంలో వినియోగిస్తున్నారు.

వెల్లుల్లి సాగుకు వర్షాకాలం అనుకూలమైనది కాదు. వానాకాలం ముగిసిన తర్వాత మాత్రమే వెల్లుల్లి సాగును ప్రారంభించాలి. అక్టోబర్, నవంబర్ నెలల్లో ఈ పంటను సాగు చేయాలి. వెల్లుల్లిని దాని మొగ్గల నుంచి పండిస్తారు. వెల్లుల్లిలో చాలా రకాలు ఉన్నాయి. వ్యవసాయ అధికారులను సంప్రదించి.. మంచి మేలు రకం సాగు చేయాలి. రియా వాన్ రకం వెల్లుల్లికి మార్కెట్‌లో మంచి రేటు ఉంది..ఒకటి వచ్చి 100 గ్రాములు ఉంటుంది.. గడ్డలు పెద్దవి అయితే మంచి లాభాలు వస్తాయి.

పంట నాలుగు నెలల్లో చేతికి వస్తుంది. వెల్లుల్లి ఒక ఎకరం భూమిలో 50 క్వింటాళ్ల వరకు దిగుబడిని ఇస్తుంది. క్వింటాల్‌కు 10000 నుంచి 21000 రూపాయల వరకు ధర పలుకుతుంది. ఎకరాకు రూ.40000 వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. మీరు ఒక ఎకరం భూమిలో రియా అటవీ రకం వెల్లుల్లి సాగు చేయడం ద్వారా సులభంగా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.. ఇంకా ప్రాసెస్ చేసి అమ్మితే ఇంకా లాభాలను పొందవచ్చు.. మీకు ఇలాంటి ఆలోచన ఉంటే ఈ వ్యాపారం ప్రారంభించండి..

Read more RELATED
Recommended to you

Latest news