ఇప్పుడు యువత ఎక్కువగా బిజినెస్ వైపు అడుగులు వేస్తున్నారు. అందులోనూ వ్యవసాయం చేస్తూ అధికలాభాలను పొందుతున్నారు.. అలాంటి వారు మరిన్ని లాభాలను పొందడానికి మీకో బిజినెస్ ఐడియా ఉంది. అదే తక్కువ పెట్టుబడితో దోససాగును ప్రారంభించండి. ఈ సాగు ద్వారా లక్షల రూపాయలను సంపాధించవచ్చు. ఉత్తరప్రదేశ్‌లోని ఓ రైతు తన పొలంలో దోసకాయలను పండించాడు. తద్వారా కేవలం 4 నెలల్లోనే రూ.8 లక్షలు సంపాదించాడు.
అతను నెదర్లాండ్స్ నుంచి దోసకాయ విత్తనాన్ని తెప్పించి తన చేనులో నాటాడు. ఈ దోసకాయలలో విత్తనాలు అస్సలు ఉండవు. అందువల్ల, రెస్టారెంట్లు మరియు హోటళ్ల నుంచి ఇటువంటి దోసకాయలకు భారీ డిమాండ్ ఉంది. ఇతర దోసకాయల కంటే వీటికి అధిక ధరలు కూడా లభిస్తున్నాయి. ఈ వ్యాపారం కోసం రైతు ప్రభుత్వం నుంచి రూ.18 లక్షలు గ్రాంట్ తీసుకుని పొలంలో షెడ్ నెట్ హౌస్ నిర్మించుకున్నాడు ఆ రైతు..
ఈ దోసను ఎటువంటి నేలలో అయినా పండించవచ్చు. పంట 60 నుండి 80 రోజులలో చేతికి వస్తుంది. ఈ సాగు కోసం భూమి యొక్క pH 5.5 నుండి 6.8 వరకు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అప్పుడు భూమి మంచిదిగా పరిగణించబడుతుంది. దోసకాయను నదులు లేదా సరస్సుల ఒడ్డున కూడా పండించవచ్చు. వేసవిలో దోసకాయకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దోసకాయను ప్రతీ సలాడ్ లో ఉపయోగిస్తారు.ఎప్పుడు వీటికి డిమాండ్ ఉంటుంది.
ప్రభుత్వం నుంచి కొంత సబ్సిడీతో ఈ వ్యవసాయం చేసుకోవచ్చు. మార్కెట్‌లో సాధారణ దోసకాయ కిలో రూ.50 వరకు ఉంది. దోసకాయ ఉత్పత్తి రైతులకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఈ పొలం నుంచి దోస సాగు ద్వారా పెద్ద ఎత్తున డబ్బు సంపాధించవచ్చు.. మీకు ఇలాంటి ఆలోచన ఉంటె మీరు కూడా ఈ పంటను పండించండి.. లాభాలను పొందండి..