చేవెళ్ల లో BRS మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పై కేసు నమోదు

-

తెలంగాణలో రోజు రోజుకు భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. ఓ వైపు రియల్టర్లు ప్రభుత్వ భూములను  కబ్జాలు చేస్తుంటే.. మరోవైపు పొలిటిషియన్స్ కూడా ఇతరుల భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భూమిని కబ్జా చేశారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

తాజాగా మరో మాజీ  ఎమ్మెల్యే పేరు కూడా తెరపైకి వచ్చేసింది. మరో బీఆర్ఎస్ నేత భూకబ్జా చేయడంతో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై చేవెళ్లలో కేసు నమోదయింది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో  దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తన భూమిని కబ్జా చేశాడని దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. తన భూమి పక్కనే ఉన్న దామోదర్ రెడ్డి భూమిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కబ్జా చేశాడట. ఈ విషయం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news