చంద్రబాబుకి ఈసారి నాలుగే.. విజయసాయిరెడ్డి ఆసక్తికర ట్వీట్

-

ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జరిగి 10 రోజులు పూర్తయ్యాయి. ఓట్ల లెక్కింపునకు మరో 10 రోజుల సమయం ఉంది.దీంతో పలువురు నేతలు కుటుంభంతో కలిసి విహార యాత్రలు చేస్తుంటే మరికొందరు పొలిటికల్ సెటైర్లు పేలుస్తున్నారు. ఒకరిపై ఒకరు సరదాగా ట్వీట్లు చేస్తూ కామెంట్లు విసురుకుంటున్నారు. ఇదే క్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి తన ట్విట్టర్లో చంద్రబాబునుద్దేశించి ఆశక్తికర మెసేజ్ పోస్ట్ చేసారు.2019లో తెలుగుదేశం పార్టీకి 23 ఎమ్మెల్యే సీట్లు రాగా ఇప్పుడు సింగిల్ డిజిట్ తప్పదని ఈ మెసేజ్ లో చెప్పుకొచ్చారు. అయితే కూటమి లెక్కలతో తాము అధికారంలోకి వస్తామని చంద్రబాబు అంటున్నారు. పోలింగ్ అనంతరం సైలెంట్ గా ఉన్న ఏ వైసీపీ సీనియర్ నేత ఇప్పుడు చంద్రబాబుపై సెటైర్లు పేల్చడం ఆసక్తిగా మారింది.

అసలు ట్విట్టర్ వేదికగావిజయసాయిరెడ్డి ఏమని ట్వీట్ చేశారో తెలుసుకుందాం.”చంద్రబాబు పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు.. 2019 ఎన్నికలలో వచ్చింది మీకు 23 స్థానాలు.. ఈసారి మా వాళ్లను.. నలుగురిని ( కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,ఆనం రామనారాయణ రెడ్డి,ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు.జూన్ 4వ తేదీన కౌంటింగ్ రాబోతోంది. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికే నీకు అర్థమయ్యే ఉంటుంది”-కదా అంటు ట్వీట్ చేశారు.ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితమవుతావని తెలిసి నీ మీద జాలేస్తోంది అంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.

జూన్ 4న రానున్న ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.ఈ క్రమలో విజయసాయిరెడ్డి ఇలా సెటైర్లు పేల్చడంలో రాజకీయం కాస్త రంజుగా మారింది. వాస్తవానికి వీళ్లిద్దరూ బంధువులు.అయితే రాజకీయంగా ఎవరు వైఖరి వారిదే.ఒకరు ఢిల్లీలో చక్రం తిప్పుతుండగా మరొకరు ఏపీలో రాజకీయాలు చేస్తున్నారు. ఈ ఇద్దరి మధ్య తాజాగా మొదలైన ట్వీట్ యుద్ధం ఆసక్తికరంగా మారింది. వీళ్లిద్దరూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని చాలారోజుల అయ్యిందిగా అని చర్చించుకుంటున్నారు.విజయసాయి రెడ్డి చెప్పినట్లు జూన్ 4న ఫలితాలు ఎవరికి అనుకూలంగా వస్తాయో చూడాలి మరి.

Read more RELATED
Recommended to you

Latest news