తెలంగాణాలో అక్కడ వారం పాటు సంపూర్ణ లాక్ డౌన్… ప్రభుత్వం సంచలన నిర్ణయం…!

-

తెలంగాణాలో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 52 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక హైదరాబాద్ పరిధిలోనే 40 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. మొత్తం కేసుల సంఖ్య 644కు చేరుకుంది.

18 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపధ్యంలో తెలంగాణా సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ ఎక్కువగా బయటపడుతున్న వికారాబాద్ లో సంపూర్ణ లాక్ డౌన్ ని అమలు చెయ్యాలని భావిస్తున్నారు. వారం రోజుల పాటు అన్నీ కూడా పూర్తిగా బంద్ చేసే నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ పౌసమి బసు తాజాగా ఉత్తర్వులు జారీ చేసారు. నిత్యావసరాలు కూడా అన్నీ మూసి వేస్తున్నట్టు పేర్కొన్నారు.

జిల్లాలో అత్యధికంగా 29 కేసులు నమోదు అయ్యాయి. మొబైల్ వ్యాన్ల ద్వారానే ప్రతి ఇంటికి సరుకులు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. రోడ్ల మీదకు ఎవ్వరూ రావొద్దని, ప్రజలు స్వీయ నియంత్రణలోనే ఉండాలని, రోడ్ల మీదకు వస్తే కేసులు తప్పవని ఆమె స్పష్టంగా హెచ్చరించారు. బుధవారం నుంచి కూరగాయల మార్కెట్లు, కిరాణా దుకాణాలు పూర్తిగా బంద్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news