జార్ఖండ్లోని కుంతి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 11 ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారానికి తెగబడ్డారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగు చూసింది. నిందితులు 10 నుంచి 15 ఏళ్ల లోపు వారు కావడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం బాధిత బాలిక పక్క గ్రామంలో జరిగిన వివాహానికి హాజరయ్యింది.
అక్కడ జరిగిన డ్యాన్స్ ప్రోగ్రాం సందర్భంగా తనకు ఇంతకు ముందే తెలిసిన నిందితులతో వాగ్వాదం జరిగింది. వివాహం అనంతరం బాలిక మరో ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి అర్ధరాత్రివేళ స్వగ్రామానికి ప్రయాణమైంది. వారి వెనుక వస్తున్న బాలలు ఆమెను అడ్డగించారు. అనంతరం ఆ అమ్మాయిని తీసుకొని నిర్మానుష్యమైన స్థలంలో లైంగిక దాడి చేశారు. ఏకంగా ఆరుగురు మైనర్లు బాలికపై అత్యాచారం చేశారు. ఇక ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేసుకొని… నిందితులను కరెక్షన్ సెంటర్ కు తరలించారు.