మన చుట్టూ ఉండే కొన్ని విషయాలు మనకు ఆశ్చర్యాన్ని.. కలిగిస్తాయి. అలాంటి కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ ఈరోజు మీకోసం..
- ప్రపంచవ్యాప్తంగా దొంగతనాలు రాత్రి కంటే పగటివేళే ఎక్కువగా జరుగుతున్నాయి.
- ఈ భూమిపై మనుషులు మాత్రమే సిగ్గుపడతారు.
- సాలీడులకు పారదర్శకమైన రక్తం ఉంటుంది.
- ప్రతి పదేళ్లకూ మనం మారిపోతాం. మన కోరికలు, అవసరాలూ పదేళ్లకోసారి మారిపోతాయి. ఓసారి ఆలోచించండి..
- అమెరికాలో ఉద్యోగాలు చేస్తూ వర్క్ ప్లేస్ లో రోజూ సగటున 11 మంది దాకా చనిపోతున్నారట.
- ఉదారభావం కలిగినవారు… ఆ భావం లేనివారి కంటే ఎక్కువ కాలం జీవిస్తారు.
- మీరు మాట్లాడుతూ ఉంటే మీకు తెలిసినవే మాట్లాడుతారు. అదే వింటూ ఉంటే… మీకు తెలియనివి తెలుస్తాయి.
- పిత్తడం (Farting) వల్ల హైబీపీ తగ్గుతుంది.
- తమతో తాము మాట్లాడుకునేవాళ్లకు ఎక్కువ I.Q. ఉండే అవకాశం ఉంటుంది.
- మొజాంబిక్ (Mozambique) జెండాపై AK-47 అస్సాల్ట్ రైఫిల్ ఉంటుంది.
- కొలొనియల్ అమెరికాలో తొలిసారిగా ఓ వ్యక్తిని చట్టపరంగా బానిసగా చేసుకున్న మొదటి వ్యక్తి నల్ల జాతీయుడు.
- 15 నుంచి 18 ఏళ్ల వయసులో పనిచేసే అబ్బాయిలు… ఆ తర్వాతి కాలంలో… పనిచెయ్యని వారి కంటే ఎక్కువ తెలివిగా ఉంటారట.
- హెన్రీ ఫోర్డ్ తన మొదటికారు (the Quadricycle)ను తన భార్యతో కలిసి అద్దెకు ఉంటున్న ఇంటి వెనకున్న టూల్ షెడ్‌లో తయారుచేశాడు.
- మీ నెగెటివ్ ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా.. మీరు డిప్రెషన్‌లోకి వెళ్తున్నారనేందుకు ఇది మొదటి హెచ్చరిక.
- అట్లాంటిక్ సముద్రంలో ఎన్ని టీస్పూన్ల నీరు ఉందో అంతకంటే ఎక్కువ అణువులు ఓ టీస్పూన్ నీటిలో ఉంటాయి.
- గొల్లభామ వెనక కాళ్లను మీరు తడితే, అది మీకు ఫ్రెండ్ అయిపోతుంది.
- ఎలుకలు వాంతి చేసుకోలేవు. అందుకే ఎలుకల మందు పనిచేస్తుంది.
- మహిళల కంటే పురుషులే ఎక్కువ సేపు నవ్వుతారు, బిగ్గరగా కూడా నవ్వగలరు.
- సూపర్ మార్కెట్లలోకి వెళ్లే మహిళల్లో 90 శాతం మంది ముందుగా కుడివైపు వెళ్తారు
వీటిల్లో మీరు దేనికో ఒకదానికి కనెక్ట్ అయి ఉంటారు కదా..! మీ ఆత్మీయులకు కూడా షేర్ చేసేయండి మరీ..!