ఎన్నికలకు చాలా దూరం ఉన్నా కూడా బీజేపీ దూకుడు మాత్రం చాలా బాగుంది. గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే గొంతు కోసుకుంటానని బండ్ల గణేశ్ అనే నిర్మాత వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఆ తరువాత వచ్చిన ఫలితాల ఆధారంగా తన మాటలను వెనక్కు తీసుకుంటున్నానని ప్రకటించారు. ఆవేశంలో వంద కాదు వెయ్యి అంటాం అవన్నీ పాటిస్తామా ఏంటి అని చెప్పి తప్పుకున్నారు కూడా ! ఇప్పుడు ఇదే బండ్ల గణేశ్ మాదిరిగానే బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడడమే విడ్డూరం. ఆ వివరం ఈ కథనంలో…
తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీకి సిద్ధం అవుతోంది. ఈ నెల 27న మాదాపూర్ హైటెక్స్ లో పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఇదే నేపథ్యంలో రెండు దశాబ్దాల తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోయింది బీజేపీ. అనుకూలంగానూ కాదు ప్రతికూలంగానూ కాదు. ఏ విధంగానూ ఆ పార్టీని నిలువరించలేకపోయింది కూడా ! తెలంగాణలో ఇప్పటికీ ఇంటి పార్టీగా టీఆర్ఎస్ ఉంది. గులాబీ దండు దూసుకుపోతోంది. కేంద్రంతో రాష్ట్రానికి విభేదాలు ఉన్నా కూడా కేసీఆర్ అవేవీ పట్టించుకోకుండా ఏం చేయాలో అదే చేస్తున్నారు. వీలున్నత ఎక్కువ అభివృద్ధి పనులకు ప్రాధాన్యం ఇస్తూ ఈ టెర్మ్ ను క్లోజ్ చేసేందుకు చూస్తున్నారు.
ఆ విధంగా కేసీఆర్ 2.0 వెర్షన్‌లో జరిగిన అభివృద్ధిని ముఖ్యంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను అభివృద్ధి నమూనాగా చూపించి, దేశ రాజకీయాల్లోనూ తన సత్తా చాటాలని భావిస్తున్నారు కేసీఆర్.. ఆ విధంగా త్వరలో అంటే ఈ నెల 27న ప్లీనరీ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సమితి జాతీయ పార్టీగా ఆవిర్భవించనుంది. ఇదే సమయంలో తమ పార్టీని నిలువరించే శక్తి లేని కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని , వీటిని ప్రజలు పట్టించుకోరని, సుస్థిరాభివృద్ధే ధ్యేయంగా తాము పనిచేస్తున్నామని పేర్కొంటూ బీజేపీ నాయకుల అపరిపక్వ వ్యాఖ్యలను ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే గొంతు కోసుకుంటానని నిజమాబాద్ ఎంపీ, ప్రముఖ బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు విన్నవారంతా ఆశ్చర్యపోతున్నారు. ఎన్నడూ లేనిది ఓ ఎంపీ స్థాయి వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం ఏంటని ఆరాతీస్తున్నారు. ఓ స్థాయి ఉన్న వ్యక్తి ఓ స్థాయి ఉన్న పదవిని అందుకున్న వ్యక్తి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వల్ల సమాజానికి తప్పుడు సంకేతాలు ఇచ్చిన వారు కావడమే కాదు నాయకులు తమ పరువు తామే తీసుకున్నవారు అవుతారని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో ఏ బీజేపీ నాయకుడూ చేయని విధంగా అరవింద్ మాట్లాడడం, ముఖ్యంగా మీడియా అటెన్షన్ కోసమే అన్నవిధంగా మాట్లాడడం అన్నది నిజంగానే,నిజంగానే బాధాకరం.