కల్యాణ్ బాబు ‘రాజకీయం’ రావట్లేదా?

-

సినిమాల్లో తిరుగులేదని అనిపించుకుంటున్న పవన్ కల్యాణ్…రాజకీయాల్లో మాత్రం తిరగలేను అన్నట్లు కదులుతున్నారు. జనసేన పార్టీ ఎనిమిదేళ్లు అవుతుంది…అయినా సరే పవన్‌కు ఇంకా రాజకీయాలపై పూర్తి గ్రిప్ వచ్చినట్లే కనిపించడం లేదు. పైగా గతంలో చిరంజీవితో కలిసి ప్రజారాజ్యంలో పనిచేశారు..అయినా సరే రాజకీయాలపై పూర్తి అవగాహన వస్తున్నట్లు కనిపించడం లేదు. ప్రజలు గెలిపించిన, గెలిపించకపోయినా సరే ఎప్పుడు రాజకీయాల్లో ఉండాలి.

pawan-kalyan
pawan-kalyan

కానీ పవన్ ఆ పని మాత్రం చేయడం లేదు…సరే వ్యక్తిగతంగా సినిమాలు తీసుకోవడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. అలా అని చెప్పి రాజకీయాలని పక్కన పెట్టకూడదు. ఏదో అప్పుడప్పుడు రాజకీయాల చేయడం వల్ల ఉపయోగం ఉండదు..ప్రజల్లో స్థానం ఉండదు. అందుకే ఇంకా జనసేన పార్టీ క్లిక్ అవ్వలేదు. ఇప్పటికిప్పుడు ఆ పార్టీకి పది సీట్లు గెలుచుకునే బలం కూడా రాలేదు.

మరి జనసేన పుంజుకోకపోవడానికి కారణం ఎవరంటే? పవన్ అనే అంటారు. ఆయనే పార్టీని నిలబెట్టాలి..ఎన్నికల్లో ఓడిపోయినా సరే పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయాలి..ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలి…ఏదో సమయం కుదిరినప్పుడు కొన్ని సమస్యలపై పోరాటం చేయడం వల్ల యూజ్ ఉండదు…నిత్యం ఏదొక సమస్యపై పోరాటం చేస్తూ, ప్రజల్లో ఉండాలి..అప్పుడే జనసేనకు మైలేజ్ వస్తుంది. టీడీపీ అధినేత చంద్రబాబు అదే చేస్తున్నారు..ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా సరే…పార్టీని నిత్యం పోరాటాలు చేస్తూ, ప్రజల్లోనే ఉంటున్నారు..అందుకే టీడీపీ చాలావరకు పుంజుకుంది.

కానీ పవన్ మాత్రం ఆ పని చేయడం లేదు…తాజాగా ఉద్యోగుల సమస్య కావొచ్చు…జిల్లాల విభజన కావొచ్చు..ఇంకా పలు సమస్యలపై పవన్ స్పందించలేదు. ఒక పార్టీకి అధినేత అంటే…అన్నీ అంశాలపై స్పందించాలి. కానీ పవన్‌కు పూర్తిగా రాజకీయం తెలియడం లేదో..లేక మనకెందుకు అనుకుంటున్నారో తెలియదు గాని…సమస్యలపై అనుకున్న విధంగా స్పందించడం లేదు. అందుకే జనసేనకు కూడా జనాల్లో ఆదరణ పెరగడం లేదు. ఇదే పరిస్తితి కొనసాగితే నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన సింగిల్‌గా పోటీ చేసి సత్తా చాటడం కష్టమే. ఇకనైనా పవన్ రాజకీయంలో దూకుడు పెంచాలి.

Read more RELATED
Recommended to you

Latest news