ముంబై: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. కొండచరియలు విరిగిపడి 11 మంది మృతి చెందారు. చెంబూరు భరత్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. కొండచరియలు విరిగిపడటంతో ఇళ్ల గోడలు కుప్ప కూలాయి. దీంతో ఇంట్లో ఉన్న ప్రజలు కొంతమంది మృతి చెందారు. గోడల కింద చిక్కుకున్న పలువురిని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కాపాడారు. ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.
కాగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాలు నీట మునిగాయి. గత రాత్రి నుంచి ముంబైలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ముంబై గాంధీ మార్కెట్‌లో భారీగా నీరు నిలిచిపోయింది. వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు ఆటకం కలుగుతోంది. రైల్వే ట్రాక్‌లపై కూడా నీరు నిలిచిపోవడంతో పలు రైళ్లను నిలిపివేశారు. ముంబైలోని హనుమాన్ నగర్ ప్రాంతంలోని ఇళ్లలోకి నీరు ప్రవేశించింది. దీంతో ఈ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.