సుప్రీంకోర్టు షాక్… కాంవడ్ యాత్ర రద్దు చేసిన ప్రభుత్వం

-

యూపీ: కాంవడ్ యాత్రపై ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించింది. ఈ యాత్రను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. కరోనా కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న నిపుణుల సూచనతో కాంవడ్ యాత్రను రద్దు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. కాంవడ్ యాత్రకు అనుమతించడంపై ఓ భక్తుడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కరోనా నేపథ్యంలో యాత్రకు అనుమతివ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్‌ను స్పీకరించిన కోర్టు కాంవడ్ యాత్రకు అనుమతులివ్వడంపై సోమవారంలోపు వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల దృష్ట్యా కాంవడ్ యాత్రను రద్దు చేసినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ యాత్రను విరమించుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

 

కాగా జల ప్రాణాల కన్నా విశ్వాసాలు గొప్పవి కావని సుప్రీంకోర్టు తెలిపింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం కాంవడ్‌ యాత్ర నిర్వహించడాన్ని అనుమతించబోమని వ్యాఖ్యానించింది. యాత్ర నిర్వహణపై పునరాలోచించుకోవాలని యూపీ ప్రభుత్వానికి సూచించింది.

Read more RELATED
Recommended to you

Latest news