వారికి ఇంటికో ఉద్యోగం.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన

-

రైతు రుణమాఫీ విషయంలో బిజెపి, బీఆర్ఎస్ కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా అమిస్తాపూర్ లో రైతు పండుగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.  అధికారంలోకి వచ్చిన పది నెలలోనే దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయని విధంగా రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. ఇది దేశ చరిత్రలోనే తొలిసారి అని తెలిపారు. దీనిపై చర్చించేందుకు తాను సిద్ధమని.. ప్రధాని నరేంద్ర మోడీ మాజీ సీఎం కేసీఆర్ సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. మొత్తం రాష్ట్రంలోని 25 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేశామని పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నీ వలసల జిల్లా చేసింది కేసీఆర్ అని మండిపడ్డారు.

CM Revanth Reddy
CM Revanth Reddy

లగచర్లలో 1300 ఎకరాల భూసేకరణను రచ్చ రచ్చ చేశారు. అమాయకులను రెచ్చగొట్టి దాడులు చేయించారు. బిఆర్ఎస్ నేతల మాటలు నమ్మి దాడి చేసిన వారు జైలుకు పోయారు. ఆ దొంగలు ఫామ్ అవుతులకు పోయి పార్టీలు చేసుకున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే బిఆర్ఎస్ నేతలు మాయ మాటలు నమ్మొద్దు అన్నారు. భూ సేకరణ లేకుండా అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడించారు. లాగా చర్ల లో ఎకరానికి 20 లక్షల చొప్పున భూసేకరణ చేస్తామని.. భూములు ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ” నా జిల్లాను మోసం చేయను.. నా ప్రజలను నేను అన్యాయం చేయబోను” అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news