నేడు హడ్కో-సీఆర్‌డీఏ మధ్య కీలక ఒప్పందం జరుగనుంది. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.11 వేల కోట్ల నిధులు మంజూరు చేసింది హడ్కో. సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం చేసుకోనుంది హడ్కో-సీఆర్‌డీఏ. డీల్ పూర్తి అయిన తర్వాత నిధులు విడుదల చేయనుంది హడ్కో. ఇందులోభాగంగానే… విజయవాడ చేరుకున్న హడ్కో CMD సంజయ్ కుల్ శ్రేష్ఠ కు స్వాగతం పలికారు మంత్రి నారాయణ,ఎంపీ బాలశౌరి.
అమరావతి నిర్మాణానికి 11 వేల కోట్లు నిధులు మంజూరు చేసింది హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్. జనవరి 22 న ముంబై లో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది. సీఎం చంద్రబాబు సమక్షంలో ఇవాళ హడ్కో – సీఆర్డీయే మధ్య ఒప్పందం జరుగనుంది. ఒప్పందం పూర్తి తర్వాత నిధులు విడుదల చేయనుంది హడ్కో. ఇక హడ్కో సీఎండి తో పాటు విజయవాడకు హడ్కో డైరెక్టర్ నాగరాజ్,ఫైనాన్స్ డైరెక్టర్ దళ్జిత్ సింగ్ ఖాత్రీ చేరుకున్నారు.