విశాఖ:- సింహాచలం, మాన్సస్ భూముల వ్యవహారం పై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజిలెన్స్ & ఎన్ఫోర్స్ మెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. దేవాదాయశాఖ కమిషనర్ ను నోడల్ అధికారిగా నియామకం చేసింది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం. ఇప్పటికే ప్రాథమిక నివేదికను సమర్పించిన దేవాదాయశాఖ త్రిసభ్య కమిటీ… సింహాచలం దేవస్థానం ప్రాపర్టీ రిజిస్టర్లో సుమారు 860 ఎకరాల భూములు గల్లంతైనట్టు అంచనా వేసింది.
మాన్సస్ భూముల అమ్మకాల్లో సుమారు రూ. 74 కోట్లు నష్టం వాటిల్లినట్టు లెక్క తేల్చింది విచారణ కమిటీ. ఇప్పటికే అడిషనల్ కమిషనర్ రామచంద్రమోహన్, సింహాచలం డిప్యుటీ ఈవో సుజాతలపై సస్పెన్షన్ వేటు వేసింది. సింహాచలం, మాన్సస్ భూముల వ్యవహారం పై మరింత లోతుగా దర్యాప్తు కొనసాగనుంది. ఈ వ్యవహారం లో ఎంతటివారిపైన అయిన వేటు వేసేందుకు సిద్దంగా ఉంది. కాగా మాన్సస్ ట్రస్ట్ వివాదంలో మరో ట్విస్ట్ నెలకొంది. మాన్సస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు తొలగించి తనను నియమించాలని ఊర్మిళ గజపతి రాజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.