ఆదివాసీలకు సీఎం కేసీఆర్ తీపి కబురు

-

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9 ) సందర్భంగా తెలంగాణ ఆదివాసీ సహోదరులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో భాగమై నివసించే అడవిబిడ్డలు, అత్యంత స్వచ్ఛమైన మనుషులని, మానవ సమాజంలో ఇంకా తరిగిపోని మమతానురాగాలకు, స్వచ్ఛమైన, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీ బిడ్డలు ప్రతీకలని సిఎం తెలిపారు.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

త్వరలోనే పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పోడు భూములకు రైతుబంధు అందిస్తున్నామని.. త్వరలోనే అటవీ భూములను సర్వే చేస్తామని హామీ ఇచ్చారు. ఆదివాసీల సంస్కృతిని ప్రపంచానికి చాటేలా కొమురంభీం భవన నిర్మాణం ఉండబోతుందని చెప్పారు. ఆదివాసీల సంస్కృతి పరిరక్షణకు మ్యూజియాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం ప్రత్యేక గురుకులాలు ఏర్పాటు చేస్తామని.. ఆదివాసీ గూడెంలు, తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేశామని వెల్లడించారు సిఎం కెసిఆర్.

Read more RELATED
Recommended to you

Latest news