బంగారం, వెండి కొనుగోలు దారులకు ఈ రోజు భారీ ఊరట లభించింది. గత పది రోజుల నుంచి వరుసగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలకు ఈ రోజు బ్రేకులు పడ్డాయి. ఇప్పటికే ధరలు వరుసగా పెరగడంతో 10 గ్రాముల బంగారం ధర రూ. 54 వేల మార్క్ ను క్రాస్ చేసింది. అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 74 వేల మార్క్ ను దాటేసింది. బంగారం, వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఇప్పటికే ఆకాశాన్ని అంటిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగితే.. సామాన్యులు ఆభరణాలకు దూరం కావాల్సిన పరిస్థితి వస్తుంది. గత పది రోజుల్లో పది గ్రాముల బంగారం ధర రూ. 1,920 వరకు పెరిగింది. అలాగే కిలో గ్రాము వెండి ధర రూ. 3,700 వరకు పెరిగింది. కాగ ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణలోని హైదరాబాద్ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,060 గా ఉంది.
కిలో గ్రాము వెండి ధర రూ. 74,200 గా ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,550 గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,060 గా ఉంది.
కిలో గ్రాము వెండి ధర రూ. 74,200 గా ఉంది.