ఇటలీలో వైద్యుల వద్దకు ఓ అరుదైన కేసు వచ్చింది. అదేంటంటే 36 ఏళ్ల వ్యక్తికి ఒకేసారి కరోనా, మంకీపాక్స్, హెచ్ఐవీ సోకినట్లు డాక్టర్లు గుర్తించారు. జర్నల్ ఆఫ్ ఇన్ఫెక్షన్లో ప్రచురితమైన వార్త ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఇటలీకి చెందిన సదరు బాధితుడు ఐదురోజుల పాటు స్పెయిన్ పర్యటనకు వెళ్లారు. వెళ్లొచ్చిన తొమ్మిది రోజులకు ఆ వ్యక్తికి జ్వరం, గొంతునొప్పి, తలనొప్పి, తొడ దగ్గర ప్రాంతంలో వాపు కనిపించాయి. ఆ లక్షణాలు కనిపించిన మూడు రోజుల తర్వాత కరోనా పాజిటివ్‌గా తేలింది. అనంతరం దద్దుర్లు, పొక్కులు రావడం ప్రారంభమైంది. దాంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లగా.. మంకీపాక్స్ సోకినట్లు తెలిసింది. అలాగే హెచ్ఐవీ పాజిటివ్‌గా ఉన్నట్లు తేలింది.
జీనోమ్ సీక్వెన్స్‌లో అతడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5.1 బారినపడినట్లు వెల్లడైందని ఆ నివేదిక పేర్కొంది. ఇక ఆ వ్యక్తి కరోనా టీకా రెండుడోసులు వేయించుకున్నాడు. కొవిడ్, మంకీపాక్స్ నుంచి కోలుకొని.. ఒక వారం తర్వాత అతడు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యాడు. హెచ్ఐవీకి మాత్రం చికిత్స పొందుతున్నాడు.