మెగాస్టార్ ఇంట్లో సినీ ప్రముఖుల సమావేశం..

మహమ్మారి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాలో సినిమా కూడా ఒకటి. థియేటర్లు మూతబడి, షూటింగులు ఆగిపోయి, ఉపాధి లేక తీవ్ర నష్టాన్ని చవిచూసారు. ఈ నేపథ్యంలో సినిమా కార్మికుల కష్టాలను తీర్చడానికి కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే. ఐతే ప్రస్తుతం సినిమా పెద్దలంతా కలిసి మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో సమావేశం అయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు మెగాస్టార్ ఆహ్వానం పలికినట్లు సమాచారం.

నాగార్జున, అల్లు అరవింద్, దిల్ రాజు, ఎన్వీ ప్రసాద్, సురేష్ బాబు, రవి ప్రసాద్, సుప్రియ, ఆర్ నారాయణ మూర్తి, సి కళ్యాణ్, కొరటాల శివ మొదలగు వారంతా ఈ సమావేశానికి హాజరయ్యారు. బీ, సీ సెంటర్లలో టికెట్ ధరలు, థియేటర్లలో విద్యుత్ టారిఫ్, సినీ, థియేటర్ కార్మికుల సమస్యలపై విస్తృతంగా చర్చ జరిపారు. అంతేకాదు సినీ కార్మికుల సమస్యలపై ఏపీ సీఎంతో భేటీ నిర్వహించే విషయంలో చర్చలు సాగాయని తెలుస్తుంది.