తిరుమలలో సంప్రదాయ భోజనం.. ఖర్చయిన రేటుకే అమ్మకం.

-

తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామి వారిని దర్శించుకోవడానికి రోజూ లక్షల్లో భక్తులు వస్తుంటారు. వారందరికీ సకల సౌకర్యాలుయ్ తిరుమలలో అందుబాటులో ఉన్నాయి. వేంకటేశ్వరుడిని దర్శించుకున్న భక్తులు తిరుపతి లడ్డూని ప్రసాదంగా స్వీకరిస్తారు. దర్శన సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భోజనం కూడా అక్కడే ఏర్పాటుగా ఉంటుంది. ఐతే ఈ భోజనంలో సంప్రదాయ భోజనం పేరుతో సరికొత్త విధానం అమలులోకి రానుంది.

గో ఆధారిత వ్యవసాయంతో పండించిన ధాన్యాలతో చేసిన వంటకాలను ఈ సంప్రదాయ భోజనంలో ఉండనున్నాయి. మొదటగా 15నుండి 30రోజుల పాటు సంప్రదాయ భోజనాన్ని భక్తులకు విక్రయించనున్నారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంత ఖర్చు చేసారో అంతే ధరకు సంప్రదాయ భోజనం భక్తులకు అందిస్తారు. ఇవేకాదు మరో నాలుగు నెలల్లో పంచగవ్వ ఉత్పత్తులైన సబ్బులు, అగరబత్తీలు సహా 15రకాల ఉత్పత్తులను భక్తులకు అందుబాటులోఖి తీసుకురానుంది టీటీడీ.

Read more RELATED
Recommended to you

Latest news