ప్రియుడితో రాసలీలలు : అడ్డుగా ఉన్న ఇద్దరు పిల్లలను ఉరేసి చంపిన తల్లి !

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనంద్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడితో రాసలీలకు అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలకు ఉరివేసి చంపింది పూరేటి లక్ష్మీ అనూష అనే మహిళ. కుమార్తె చిన్మయి (8) , కుమారుడు మోహిత్ (6) లను నిన్న రాత్రి ఇంట్లో ఉరివేసి హత్య చేసింది తల్లి లక్ష్మీ అనూష. బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఓ వ్యక్తి తో సహజీవనం చేస్తున్న లక్ష్మీ అనూష.. తన రాసలీలలకు.. అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను ఉరివేసి చంపింది.

13 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో.. తాడేపల్లి నుంచి వచ్చి.. రాజమండ్రి లో నివాసం ఉంటోంది ఆ మహిళ. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆఅ వ్యక్తితో పరిచయం ఏర్పడినప్పటి నుంచి.. తన బిడ్డలను తరచూ కొట్టేది పూరేటి లక్ష్మీ అనూష.

ఇక ఇటీవల పిల్లల్ని కొట్టద్దని అడ్డు వచ్చిన.. తల్లి ముత్యం కనకదుర్గను కూడా గాయపర్చిండి పూరేటి లక్ష్మీ అనూష. ఇక నిన్న ఏకంగా పిల్లలను ఉరివేసి చంపింది ఆ కసాయి తల్లి. పిల్లలకు ఉరి వేసిన అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పింది ఆ మహిళ. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ కసాయి తల్లిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ కసాయి తల్లి రాజమండ్రి త్రీటౌన్ పోలీసు స్టేషన్ లో ఉంది. పోస్ట్ మార్టం నిమిత్తం చిన్నారుల  మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు పోలీసులు.