ఆఫ్ఘనిస్తాన్ లో చిక్కుకున్న తెలంగాణ వాసి

ఆఫ్ఘనిస్తాన్ దేశం లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. అయితే ఆఫ్ఘనిస్తాన్ దేశం లో చిక్కుకున్న ఈ వ్యక్తిని కరీంనగర్ జిల్లా గంగదర మండలం వాడయ్యారం గ్రామానికి చెందిన పెంచల వెంకటేశ్వరరావు గా గుర్తి ంచారు. ఇంజనీరింగ్ వర్క్స్ కోసం వెంకటేశ్వరరావు ఆఫ్ఘనిస్తాన్ దేశం వెళ్ళినట్లు తెలుస్తోంది. అయితే తాలిబన్ల ఆకస్మిక ముట్టడితో.. ఆఫ్ఘనిస్తాన్ లోనే చిక్కుకు పోయాడు వెంకటేశ్వరరావు. ఇక ఈ విషయం తెలుసుకున్న వెంకటే శ్వరరావు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

వెంకటేశ్వరరావు ను ఆఫ్ఘ నిస్తాన్ నుంచి సురక్షితంగా భారత్ కు తీసుకురావాలని అతని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని అన్యాయంగా తాలిబన్లు స్వాధీనం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆఫ్ఘనిస్తాన్ లో రాజ్యాంగ సంక్షోభం నెలకొంది. అటు తాలిబన్ల వ్యవహారం కారణంగా… ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఎలాగైనా ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి వెళ్లిపోవాలని టాబు ఎయిర్పోర్టులో పడిగాపులు కాస్తున్నారు.