ఏపీకి మూడు రోజుల పాత వర్షాలు ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ప్రాంత అనుబంధ ఉపరితల ఆవర్తనం నుండి ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి ఇపుడు ఉత్తర ఒడిశా మరియు ప్రక్కనే ఉన్న దక్షిణ జార్ఖండ్ & గంగానది పశ్చిమ బెంగాల్ నుండి తెలంగాణ మరియు రాయలసీమ మీదుగా విదర్భ నుండి ఉత్తర తమిళనాడు తీరం వరకు సగటు సముద్ర మట్టము నుండి 1.5 కి.మీ ఎత్తు వరకు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితముగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది..రేపు ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంటుంది .రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షం కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంటుంది.
రాయలసీమ : రాయలసీమ లో ఈరోజు ,రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.