హీరోగా మంత్రి కేటీఆర్‌కు ఛాన్స్‌.. కానీ..

-

సోషల్ మీడియాలో తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. #AskKTR పేరుతో నిర్వహించిన చిట్ చాట్‌‌లో తెలంగాణతో పాటు ఏపీ, జాతీయ రాజకీయ అంశాలు, అభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. వాటికి మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సినిమాలో హీరోగా అవకాశం ఇస్తామంటూ ఓ నెటిజన్ ఆఫర్ చేశాడు.

ఈ నేప‌థ్యంలోనే ఒక వేళ సినిమాల్లో నటించానుకుంటే… ఎలాంటి సినిమాలో నటిస్తారు? మీరు నటించాలనుకుంటే సినిమా అవకాశం ఇస్తామని ఓ నెటిజన్ అన్నారు. దీనికి సమాధానంగా సదరు నెటిజన్ కు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. కానీ.. తనకు ఫుల్ టైమ్ జాబ్ ఉందని.. సినమాల్లో నటించేంత సమయం తనకు లేదని ఆయన చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news