ఇప్పటికే కరోనా డబుల్ మ్యుటెంట్లతో ఇండియా అల్లకల్లోలం అవుతోంది. రోజూ 4లక్షలకు పైగా కేసులు, వేలాది మరణాలతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది చాలదన్నట్టు ఇప్పుడు మరో పిడుగులాంటి వార్త చెప్పింది అంతర్జాతీయ ఫార్మా కంపెనీ మరో బాంబు పేల్చింది. ప్రపపంచం మొత్తానికి హడలెత్తించే నిజాలు బయటపెట్టింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ మోడెర్నా సీఈవో స్టేఫెన్ బాన్సల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కరోనా కొత్త స్ట్రెయిన్ రాబోతోందని చెప్పారు. రాబోయే ఆరు నెలల్లో ఈ కొత్త రకం వైరస్ విధ్వంసం సృష్టిస్తుందని వివరించారు. దీన్ని ఎదుర్కోవడానికి ప్రపంచం రెడీగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ఉన్న బ్రెజిల్, దక్షిణాఫ్రికా స్ట్రెయిన్లపై పోరాడే టీకాను రూపొందించినట్టు ఆయన కంపెనీ మోడెర్నా ప్రకటించిన కొద్ది రోజులకే ఆయన ఈ వార్త చెప్పారు.
మోడెర్నా కంపెనీ తయారుచేస్తున్న టీకాలు బాగానే పనిచేస్తున్నాయని ఆయన వివరించారు. అయితే మార్పుచెందుతున్న స్ట్రెయిన్లపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేయాల్సి ఉంటుందని, అందుకోసం టీకాల్లో మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ఏదేమైనా మరిన్ని మ్యుటెంట్లు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.