బూస్ట‌ర్ డోసుల‌కు నో చెప్పిన కేంద్రం

-

బూస్ట‌ర్ డోసులు వేయ‌డానికి అనుమ‌తి అడిగిన రాష్ట్రాల‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. బూస్ట‌ర్ డోసుల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేమ‌ని చేతులు ఎత్తేసింది. అయితే రాష్ట్రాలు కాకుండా ఐసీఎంఆర్ సిఫార్సు చేస్తే అప్పుడు బుస్ట‌ర్ డోసుల గురించి ఆలోచిస్తామ‌ని కేంద్రం తెల్చి చెప్పింది. కాగ దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ‌స్తున్న నేప‌థ్యం లో ఆంధ్ర ప్ర‌దేశ్ తో పాటు కేర‌ళ‌, క‌ర్ణాటక రాష్ట్రాల ప్ర‌భుత్వాలు బుస్ట‌ర్ డోస్ పంపిణీ కోసం కేంద్ర ప్ర‌భుత్వం అనుమ‌తి కోరాయి.

ఆయా రాష్ట్రా ల‌లో ఫ్రంట్ లైన్ వ‌ర్క‌ర్ల‌కు, ఆరోగ్య కార్య‌క‌ర్త ల‌కు తో పాటు ఇత‌ర సిబ్బంది కి బుస్ట‌ర్ డోసు ఇవ్వాడానికి కేంద్ర ప్ర‌భుత్వాన్ని కోరాయి. అయితే దీనికి కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రించింది. అంతే కాకుండా బూస్ట‌ర్ డోసులు పంపిణీ చేయాల‌ని ఎవ‌రూ చెప్పార‌ని ఆయా రాష్ట్రా ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌శ్నించింది. ఐసీఎంఆర్ చెబుతినే బూస్ట‌ర్ డోసు ల‌కు అనుమ‌తి ఇస్తామ‌ని కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది. కాగ ప్ర‌పంచ వ్యాప్తం గా ఓమిక్రాన్ వేరియంట్ విస్త‌రిస్తున్న నేప‌థ్యం లో చాలా దేశాలు బూస్ట‌ర్ డోసు ను పంపిణీ చేయ‌డానికి రంగం సిద్ధం చేస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news