ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయండి.. హైకోర్టులో పిటిషన్‌

-

తెలంగాణ ఇంటర్ పరీక్షల నిర్వహణపై తీవ్ర సంధిగ్డత నెలకొంది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు చేయాలని హై కోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. హైకోర్టు లో పిటిషన్ దాఖలు చేసింది తెలంగాణ తల్లిదండ్రుల సంఘం. ప్రమోట్ అయిన విద్యార్థులకు పరీక్షలు నిర్వహించవద్దని హై కోర్టు ను కోరారు పిటిషనర్. పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను పాస్ చేయాలని హైకోర్టు కు విన్నవించారు పిటిషనర్. తల్లిదండ్రుల సంఘం తరఫున న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్ పై రేపు విచారించే అవకశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. కాగా అటు ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాటు పై జిల్లా కలెక్టర్లు, ఇంటర్ విద్యా శాఖ అధికారులతో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ నెల 25 నుండి వచ్చే నెల 3 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తమ డిమాండ్స్ పరిష్కరించక పోతే పరీక్షలు బహిష్కరిస్తామని ప్రైవేట్ జూనియర్ కాలేజి ల యాజమాన్యాలు అంటున్నాయి. అయితే ప్రైవేట్ జూనియర్ కాలేజి ల తీరు పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షల సమయంలో సహకరించం అని అనడం సరైంది కాదని.. ఏదన్నా ఉంటే కలిసి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలన్నారు సబితా ఇంద్రారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news