ముంబై డ్రగ్స్ కేస్… దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ డ్రగ్స్ కేస్ లో బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇటీవల అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కు NCB అధికారులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇవాళ ఉదయం 12 గంటల సమయంలో బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ ఇంట్లో… NCB అధికారులు సోదాలు నిర్వహించారు.
జైల్లో ఉన్న తన కొడుకు ఆర్యన్ ఖాన్ ను షారుక్ ఖాన్ కలిసిన కొద్ది గంటలకే… ఆయన ఇంటికి వెళ్ళింది ఎన్సీబీ బృందం. ఈ నేపథ్యం లోనే షారుక్ ఖాన్ ఇంట్లో ఎన్సీబి అధికారులు డ్రగ్స్ దాఖలా లపై తనిఖీలు చేశారు. ఇక అటు లైగర్ హీరోయిన్, బాలీవుడ్ స్టార్ అనన్య పాండే కు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్సీబి అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగానే ఇవ్వాళ ఉదయం అనన్య పాండే నివాసానికి చేరుకున్న ఎన్సీబి బృందం… డ్రగ్స్ దాఖలా లపై తనిఖీలు నిర్వహించారు. తనిఖీల అనంతరం ఈ డ్రగ్స్ కేసులో విచారణకు హాజరుకావాలని అనన్య పాండే కు నోటీసులు జారీ చేసింది NCB బృందం.