వృద్ధుడి మెడను చుట్టేసి మింగేయబోయిన కొండచిలువ..!! చివరికి

-

సోషల్‌ మీడియాలో రోజు ఎన్నో వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. అయితే అందులో కొన్ని ఫన్నీవి ఉంటే.. కొన్ని భయంకరమైనవి ఉంటాయి. వాటిని చూస్తుంటేనే మనకు చెమటలు పడతాయి..అంత ఘోరంగా ఉంటాయి.. మీరెప్పుడైనా కొండచిలువను దగ్గర నుంచి చూశారా..? ఎప్పుడూ దీని గురించి వినడం, టీవీలో చూడటం తప్ప లైవ్‌లో చాలా తక్కువ మంది చూసి ఉంటారు.. ఈ వీడియోలో పైతాన్‌ సైతాన్‌లా ఆ వృద్ధుడి మెడను చుట్టేసింది. ఇంకొంచెం లేటై ఉంటే..అది అతన్ని మింగేసి ఉండేది.. ఆ వైరల్‌ వీడియోలో ఇంకా ఏముందంటే..

ఈ వీడియోలో ఓ ముసలి వ్యక్తిని భయంకరమైన కొండచిలువ నిలువునా మింగేందుకు ప్రయత్నిస్తుంటుంది. కొండచిలువతో వేషాలేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా బాగా తెలుస్తుంది. అందుకే పోస్ట్ చేసిన క్షణాల్లోనే విపరీతంగా వేగంగా వైరల్ అవుతోంది.

ఓ కొండ చిలువ తనదారిన అది పోతోంది. అప్పుడే ఓ ముసలి వ్యక్తి ఆ కొండచిలువను అలా వదిలేయకుండా దాన్ని ఇబ్బంది పెట్టసాగాడు. దాంతో ఆ కొండచిలువకు చిర్రెత్తుకొచ్చినట్లు ఉంది. ఆ వ్యక్తిపై దాడి చేసింది. ఆ ముసలి వ్యక్తి మెడను చుట్టేసింది. ఎంతలా అంటే శ్వాస కూడా పీల్చుకోవడం కష్టమైంది. అలానే ఆ వ్యక్తిని మింగేందుకు ప్రయత్నించసాగింది. ఈలోగా కొంతమంది అక్కడికి చేరుకుని ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తారు. ఆ కొండచిలువ ఎంత బలంగా ఆ వృద్ధుడి మెడ పట్టుకుంది అంటే.. అస్సలు ఇద్దరు మనుషులు ఎంత ప్రయత్నించినా అది వదలలేదు సరికదా అతన్ని కిందపడేసింది. అయితే వీడియోలో ఇంతకీ ఆ వృద్ధుడిని అది విడిచిపెట్టిందా లేదా అనేది కనిపించలేదు. బహుశా..ఆ వీడియో తీసిన వ్యక్తి కూడా ఫోన్‌ పక్కన పెట్టి కాపాడేందుకు వెళ్లినట్లు ఉన్నారు.! ధైర్యం ఉంటే మీరు కూడా ఆ వీడియో చూడండి.! ఒకవేళ ఆ వృద్ధుడి ఆ కొండచిలువ నుంచి తప్పించుకున్నా.. ఆ భయం మాత్రం జీవితాంతం ఉంటుంది. వామ్మో ఎంత ఘోరంగా పట్టేసుకుందో..!!

Read more RELATED
Recommended to you

Latest news