పెట్రోల్ ఫ్రీ.. కానీ.. ఆ బంకుకి బికినీలో వస్తేనే..!

-

బై వన్ గెట్ వన్, 20 పర్సెంట్, 50 పర్సెంట్, 100 పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇలా రకరకాల ఆఫర్లను చూసే ఉంటారు. మరీ ఈ బికినీ ఆఫర్ల గురించి ఎప్పుడైనా విన్నారా..? నిజమే బికినీ వేస్తే.. పెట్రోల్ ఫ్రీ అన్న బంఫర్ ఆఫర్ అందరినీ ఆకర్షించింది. డబ్బు తీసుకోకుండా… పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇచ్చేందుకు ఏ దేశ ప్రభుత్వమూ ముందుకు రాదు. అయితే రష్యా సమారాలోని ఓల్వీ గ్యాస్ స్టేషన్ మాత్రం బంపరాఫర్ ప్రకటించింది. చిత్రమైన మార్కెటింగ్ వ్యూహంలో భాగంగా బికినీలో వస్తే ఫ్రీ పెట్రోల్ అని ఆఫర్ పెట్టి.. అందరికీ షాక్ ఇచ్చారు. ఈ ఆఫర్‌తో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కోసం అమ్మాయిలంతా బికినీల్లో వచ్చేస్తారనీ.. పండగ చేసుకోవచ్చని అనుకుంది ఆ బంక్ యాజమాన్యం.

కానీ.. వారికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఎందుకంటే.. అమ్మాయిలెవరూ ఆ బంకుకి బికినీలతో రాలేదు. అబ్బాయిలు మాత్రం బికినీ డ్రెస్సులు కొనుక్కొని మరీ బంకుకు రావడం మొదలుపెట్టారు. ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి బికినీ బాయ్స్ తండోప‌తండాలుగా వ‌స్తుంటే విస్తుపోయిన బంక్ సిబ్బంది వాళ్లను చూడలేక తలలు పట్టుకుంటున్నారు. దీంతో బంక్ యజమాని తాము ఇచ్చిన ఆఫర్ టైమ్ తగ్గించి మూడు గంటల వరకే అని కుదించాడు. ప్ర‌స్తుతం ఈ బికినీ బాయ్స్ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో తెర వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news