ఎస్సై వేధంపులు తట్టుకోలేక డిగ్రీ చదివే ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్నారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. మురళి అనే విద్యార్థి విజయవాడలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. మురళీ తండ్రి చనిపోవడంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత తీసుకున్నాడు. పగలు విద్యార్ధిగా, రాత్రి టీ కొట్టు నడుపుతూ కుటంబానికి పెద్దదిక్కయ్యాడు. అయితే ఆదివారం రాత్రి గన్నవరంలోని తన నివాసానికి విద్యార్ధి వెళ్తున్నాడు. అదే సమయంలో ఎస్సై నారాయణమ్మ భర్త బైక్ మీద అదే దారిలో వెళ్తోంది. ఈ సమయంలో మురళీ ఎదురుగా రావడంతో ఒకరినొకరు ఢీ కొన్నారు.
వెంటనే ఎస్సై నారాయణమ్మ మురళిని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లి ప్రశ్నించింది. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన మురళీ చరవులో దూకి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. గన్నవరం ఎస్సై నారాయణమ్మ తనను మానసికంగా వేధించిందని, తన చావుకు కారణంగా చెప్తూ స్నేహితుడికి చివరిగా ఫోన్ చేశాడు. ఈ కాల్ డేటా ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.