గద్వాల జిల్లాలో పట్టపగలే వరుస చోరీలు..

-

పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేటిదొడ్డి మండల పరిధిలోని యర్సన్‌దొడ్డి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోరికి పాల్పడ్డారు.స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని రైతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంట్లో ఎవరూ లేరని గ్రహించిన దొంగలు పలు ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు.పొలం పనులు ముగించుకుని ఇంటికి చేరిన మల్లయ్య, కుర్వ కిష్టప్ప, రాజు, తదితర రైతుల ఇళ్ల తాళాలు పగులగొట్టి ఉండటంతో అంతా షాక్ అయ్యారు.

ఇంట్లోని బంగారు అభరణాలు, నగదు ఎత్తుకెళ్లినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వారంతా కేటిదొడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్సై శ్రీనివాసులు,సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం సాయంతో దొంగల వేలి ముద్రలను సేకరించారు. అయితే, ఆదివారం మధ్యాహ్నం ఓ వ్యక్తి గ్రామంలో అనుమానస్పదంగా తిరుగుతుండగా గ్రామస్తులు అతన్ని విచారించారు.గతంలో జిల్లాలో దొంగతనానికి పాల్పడిన నిందితులే యర్సన్‌దొడ్డి గ్రామంలోనూ చోరీకి పాల్పడినట్లుగా గ్రామస్తులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news